Varsham
వర్షం నా కలకాల స్నేహం (వర్షం అనగానే మనకి యాదికి వచ్చే విషయాలు) . మేడ మీద బట్టలు . రోడ్ మీద బజ్జిలు . సఖి సైన్మల పాటలు . అజామ్ భాయ్ దుకాన్ల తాగిన సిగరెట్లు (ఇంకా గివె కాక వర్షం పడ్డపుడు మనకి కొన్ని చేయాలి అని ఉంటుండె … అరే ఎం గాలిస్ గానివి ఉన్నావ్ కాకా గవి కాదు కింద సూడరాదే..) . చిన్నపుడు వాన పడితే ఐస్ క్రీం తినాలి అని మనసైతుండే …కానీ జరం వస్తది అని గుబులైతుండే. . జర్ర మీసాలు మొల్చినాక వాన ఒస్తే ఏవేవో చిలిపి పన్లు…ఎమ్మటే ఎవని కన్ల పడకుండా ఉండనికి వెతికే కారణాలు. . వర్షం పడ్డప్పుడు మన బండి మీద దోస్తు గాడిని కానీ / లేదా మన పోరీని ఏసుకొని పోతే ఆ సుఖమే వేరు ఉంటది కాకా. గీ ముచ్చట్లు అన్ని చెప్తుంటే చిన్నప్పుడు మా ముసల్ది వాన కోసం ఓ పాట పాడ్తుండే … (రా రా వానయ్య రా రా వన్నాయా ఆ బాన్నయ్య ని ఎన్నెకి తోసి రా రా వన్నయ్య ) వాహ్ మస్త్ పడుతుండే కాకా మా ముసల్ది… ఇట్ల వానకి నాకు మధ్య సంఘటనలు యాద్ తెచ్చుకొని మళ్ళా వాన ఎప్పుడు పడ్తదా అని సూస్తున్న... _BhanuPrasad...