Varsham
వర్షం నా కలకాల స్నేహం
(వర్షం అనగానే మనకి యాదికి వచ్చే విషయాలు)
. మేడ మీద బట్టలు
. రోడ్ మీద బజ్జిలు
. సఖి సైన్మల పాటలు
. అజామ్ భాయ్ దుకాన్ల తాగిన సిగరెట్లు
(ఇంకా గివె కాక వర్షం పడ్డపుడు మనకి కొన్ని చేయాలి అని ఉంటుండె … అరే ఎం గాలిస్ గానివి ఉన్నావ్ కాకా గవి కాదు కింద సూడరాదే..)
. చిన్నపుడు వాన పడితే ఐస్ క్రీం తినాలి అని మనసైతుండే …కానీ జరం వస్తది అని గుబులైతుండే.
. జర్ర మీసాలు మొల్చినాక వాన ఒస్తే ఏవేవో చిలిపి పన్లు…ఎమ్మటే ఎవని కన్ల పడకుండా ఉండనికి వెతికే కారణాలు.
. వర్షం పడ్డప్పుడు మన బండి మీద దోస్తు గాడిని కానీ / లేదా మన పోరీని ఏసుకొని పోతే ఆ సుఖమే వేరు ఉంటది కాకా.
గీ ముచ్చట్లు అన్ని చెప్తుంటే చిన్నప్పుడు మా ముసల్ది వాన కోసం ఓ పాట పాడ్తుండే …
(రా రా వానయ్య రా రా వన్నాయా
ఆ బాన్నయ్య ని ఎన్నెకి తోసి రా రా వన్నయ్య )
వాహ్ మస్త్ పడుతుండే కాకా మా ముసల్ది…
ఇట్ల వానకి నాకు మధ్య సంఘటనలు యాద్ తెచ్చుకొని మళ్ళా వాన ఎప్పుడు పడ్తదా అని సూస్తున్న...
_BhanuPrasad...
Amma Baboi 🥂
ReplyDelete